CAREER

Wednesday 28 January 2015

కేంద్ర దళాల్లో కానిస్టేబుల్ కొలువులు

ఖాళీలు:
  • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) - 17698
  • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) - 4493
  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) - 22623
  • సహస్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ) - 5619
  • ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) - 2795
  • ఏఆర్ - 300
  • నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) - 82
  • స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్) - 247
  • మొత్తం: 62390
విద్యార్హత: ఆగస్టు 8, 2015 నాటికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

శారీరక కొలతలు:
ఎత్తు: పురుషులు - 170 సెం.మీ.
మహిళలు - 157 సెం.మీ.
చాతి (పురుషులకు మాత్రమే): 80 సెం.మీ.
గాలి పీల్చినపుడు చాతి 5 సెం.మీ పెరగాలి.
  
వయోపరిమితి: ఆగస్టు 8, 2015 నాటి అభ్యర్థి వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1992 కంటే ముందు, 01.08.1997కు తరవాత జన్మించి ఉండకూడదు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయసు సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం:
ఎంపిక విధానం మూడు దశల్లో జరుగుతుంది.
1. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ):
 శారీరక కొలతల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పరుగు పందెం నిర్వహిస్తారు.
 పురుష అభ్యర్థులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో పూర్తిచేయాలి.
 మహిళా అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 8.5 నిమిషాల్లో పరుగెత్తాలి.

 2. రాత పరీక్ష:
 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షను అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రాసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్ష విధానాన్ని (ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్) దరఖాస్తులో ఎంపిక చేసుకోవాలి.ఆన్‌లైన్ పరీక్షలో ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. ఆఫ్‌లైన్ ప్రశ్నపత్రం.. ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషలో ఉంటుంది.
 మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంట్రీ మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్/హిందీ సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సెక్షన్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండు గంటలు.

 3. మెడికల్ టెస్ట్: రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఆఖరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
 అన్ని పరీక్షల్లో మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

 ఫీజు: రూ. 50/-
 అభ్యర్థులు ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా ఎస్‌బీఐ బ్యాంక్ చలాన్ ద్వారా ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ ఉద్యోగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
 
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం:అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లు http://ssconline.nic.in/ లేదా http://ssconline2.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిలో రెండు దశల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
పార్ట్ 1 రిజిస్ట్రేషన్‌లో అడిగిన వివరాలన్నీ (పేరు, చిరునామా, విద్యార్హతలు) సవ్యంగా నింపి దరఖాస్తును సబ్‌మిట్ చేయాలి. ఇక్కడ జనరేట్ అయిన రిజిస్ట్రేషన్ నంబర్‌ను భద్రపరుచుకోవాలి. ఈ నంబర్ ఆధారంగా పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంటుంది.

రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ సహాయంతో పార్ట్ 2 రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫొటో, సంతకాలను అప్‌లోడ్ చేయాలి. వీటిని సబ్‌మిట్ చేసిన తరువాత ఫీజు చెల్లించే పేజీ వస్తుంది. ఫీజు మీరు ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కాని లేదా ఎస్‌బీఐ చలాన్ ప్రింట్ తీసుకుని బ్యాంకులో కాని చెల్లించొచ్చు. ఫీజు చెల్లిస్తేనే మీ ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తవుతుంది. సకాలంలో ఫీజు చెల్లించనట్లైతే మీ దరఖాస్తును తిరస్కరిస్తారు.

కాల్ లెటర్స్:ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో పాల్గొనాల్సిన అభ్యర్థులకు కాల్ లెటర్స్‌ను సీఆర్‌పీఎఫ్ అందజేస్తుంది. ఆన్‌లైన్‌లో విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీఆర్‌పీఎఫ్ వెబ్‌సైట్ http://www.crpf.nic.in లో 15-04-2015 నుంచి 15-05-2015 వరకు కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీఈటీ టెస్టుకు వెళ్లే అభ్యర్థులు కాల్ లెటర్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు (డ్రైవింగ్ లెసైన్స్, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు) తప్పనిసరిగా తీసుకెళ్లండి.

పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు.

 ముఖ్యమైన తేదీలు:ఆన్‌లైన్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ముగింపు తేది: 21, ఫిబ్రవరి 2015
ఆన్‌లైన్ పార్ట్ 2 రిజిస్ట్రేషన్ ముగింపు తేది: 23, ఫిబ్రవరి 2015

మరిన్ని వివరాల కోసం http://ssc.nic.in/notice/examnotice/FINAL_NOTICE_%
28Employment%20News%29_24_01_2014.pdf

No comments:

Post a Comment

Related Posts ...

Related Posts Plugin for WordPress, Blogger...